వెంకటేష్ సరసన నిత్యామీనన్..

- September 10, 2016 , by Maagulf
వెంకటేష్ సరసన  నిత్యామీనన్..

బాబు బంగారం సినిమాతో సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాలా ఖద్దూస్ రీమేక్ గా తెరకెక్కుతున్న.. గురు(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఓ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు.రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కిశోర్ తిరుమల, దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు అంగీకరించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మలయాళి భామ నిత్యామీనన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించిన నిత్యా, వెంకటేష్ తో కలిసి నటిస్తుండటపై ఆనందం వ్యక్తం చేసింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com