ధృవ రిలీజ్ పోస్ట్ పోన్ ....
- September 10, 2016
మెగాఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న చిత్రాల్లో రాంచరణ్ నటిస్తున్ ధృవ చిత్రం ఒకటి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించారు. కానీ...ధృవ దసరాకి రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనక సెంటిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో దసరాకి రిలీజైన గోవిందు అందరివాడేలే, బ్రూస్ లీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత సందడి చేయలేకపోయాయి. అందుకే ధృవ మూవీని దసరాకు కాకుండా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.సెంటిమెంట్ కారణంగా ధృవ రిలీజ్ పోస్ట్ పోన్ వార్తలపై మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉన్నారట. అయితే డేట్ మార్పుపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది.మరోవైపు డీవైడ్ టాక్ లోనూ జనతాగ్యారేజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ జనతాను ధృవ బీట్ చేస్తాడని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో జనతా గ్యారేజ్‌ను ధృవ మించిపోయాడు. వైజాగ్‌లో జనతా హక్కులు 5.1 కోట్లకు అమ్ముడు కాగా...ధృవ 5.4 కోట్లు కొల్లగొట్టిందట. దీనిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోందని సమాచారం. ధృవ ప్రీరిలీజ్ బిజినెస్ అటు ఎన్టీఆర్ అభిమానులకే కాక, సినీ వర్గాలకు సైతం ఆశ్చర్యాని గురిచేసిందట. మునుముందు ధృవ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







