సిరియా పై దాడులు: 45 మంది మృతి, 90 మందికి గాయలు
- September 10, 2016
సిరియాపై ఒప్పందానికి రష్యా, అమెరికా అంగీకరించిన ఒక రోజు తరువాత అక్కడి ఓ మార్కెట్, రెబెల్‌ల అధీనంలోని ఇద్లిబ్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో శనివారం జరిగిన వైమానిక దాడుల్లో 45 మంది చనిపోయారు. మరో 90 మంది గాయపడటానికి కారణమైన ఈ దాడికి పాల్పడింది ఎవరో తెలియరాలేదు. కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోవడంతో మృతుల్లో సాధారణ పౌరులు ఎందరన్నది స్పష్టం కాలేదు. దాడుల్లో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.సిరియాలో సోమవారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమవుతుందని జెనీవాలో చర్చల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ ఒప్పందం అమలైతే ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాలపై దాడులను ఆపాలి. ఫలితంగా యుద్ధ ప్రభావిత పౌరులకు అవసరమైన సాయం అందుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







