విదేశీ ఉగ్రవాదులు హతం : కశ్మీర్‌

- September 11, 2016 , by Maagulf
విదేశీ ఉగ్రవాదులు హతం : కశ్మీర్‌

 ఓవైపు ఆందోళనలు, మరో ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్‌ అట్టుడుకుతూనే ఉంది. తాజాగా ఆదివారం కూడా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పూంచ్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఎల్‌వోసీకి సమీపంలో హంద్వారాలోని నౌగామ్‌ సెక్టర్‌లో విదేశీ ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు సరిహద్దుల మీదుగా చొరబడేందుకు ప్రయత్నించడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారా కనుగొనేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.ఇంకోవైపు కశ్మీర్‌ లోయలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com