విమానంలో 'అల్లాహ్ అక్బర్'.. 'మరణం సమీపిస్తోంది' అని అరుపులు
- September 11, 2016
గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా చేతికి బేడీలు ఉన్న వ్యక్తి 'అల్లాహ్ అక్బర్'.. 'మరణం సమీపిస్తోంది' అని బిగ్గరగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంగ్లాండ్‌లోని గాట్విక్ నుంచి వెనిస్ బయలుదేరిన ఈజీజెట్ ఈజెడ్‌వై5263 విమానంలో ఈ ఘటన జరిగినట్లు బ్రిటీష్ హోం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చేతికి బేడీలు ఉన్న ఆ వ్యక్తి 29 సార్లు అల్లాహ్ అక్బర్, 17 సార్లు మరణం సమీపిస్తోంది, మనం అందరం చనిపోబోతున్నాం అని తొమ్మిది సార్లు అరిచినట్లు ప్రయాణికులు వెల్లడించారు.
అతడి కేకలతో భయపడిపోయిన ప్రయాణికులు, చిన్నారులు ఏడ్వడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన అధికారులు అతడ్ని అరవకుండా అదుపు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







