`అరకు రోడ్ లో థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
- September 13, 2016
రాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `అరకు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో కళ్యాణ్‌రామ్ విడుదల చేశారు. బిగ్ సీడీని పూరి జగన్నాథ్, కళ్యాణ్‌రామ్ విడుదల చేశారు. ఆడియో సీడీలను పూరి జగన్నాథ్ విడుదల చేసి తొలి సీడీని కళ్యాణ్‌రామ్ కు అందించారు. పూరి సంగీత్ ద్వారా మార్కెట్లోకి పాటలు విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా..పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - అరకురోడ్‌లో థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం టీం పడ్డ కష్టమంతా తెలుస్తుంది.చాలా బావుంది. గడ్డం సాంగ్ బావుంది. అన్నీ సాంగ్స్‌లో ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్ వాసుదేవ్, నిర్మాతలు సహా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్.అన్నారు. హీరో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ - రాం శంకర్ గత పదేళ్లుగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. హిట్ కోసం ట్రై చేస్తూ ముందడుగు వేయాలని సాయిరాం శంకర్‌కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడ్డం తెల్లబడిపోతుందనే సాంగ్‌ను రాంశంకర్ ఎప్పుడో చూపించాడు. చూడగానే నచ్చేసింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా బావుంది. ఈ అరకు రోడ్‌లో సినిమా రాంశంకర్ కు మంచి బ్రేక్ తెస్తుందని భావిస్తున్నాను. దర్శకుడు వాసుదేవ్ చాలా టాలెంటెడ్ అని తెలుస్తుంది. నిర్మాతలు సహా నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్.. అన్నారు.రాం శంకర్, నికిషా పటేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్.
తాజా వార్తలు
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!







