మనుషుల్ని నరికి పండుగ చేసుకున్న ఐసిస్
- September 13, 2016
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్(ఈదుల్ అజ్ హా) వేడుకులు జరుపుకొంటున్న తరుణాన ఐసిస్ ఉగ్రవాద సంస్థ దారుణానికి ఒడిగట్టింది. గొర్రెలకు బదులు బందీల పీకలు తెగకోసి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఒక జంతువధ శాలలో చిత్రీకరించినట్లుగా ఐసిస్ చెబుతోన్న వీడియోలో భారీ కాయుడైన జిహాదీ ఒకడు.. బందీలను దారుణంగా హతమార్చాడు. ఈ బందీలంతా సిరియాలో అమెరికా సైన్యాల కోసం గూఢచర్యం చేసి పట్టుబడ్డవారని, అందుకే ఈ నరికివేత వీడియోకు 'మేకింగ్ ఆఫ్ ఇల్లూషన్'(వంచన చేయడం) అనే పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది.
గొర్రెలను వేలాడదీసే కొక్కేలకు బందీలను తలకిందులుగా వేలాడదీసి, పదునైన కత్తితో పీకలుకోశారు. 'ఇది ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన వీడియో'అని సిరియన్ హక్కుల కార్యకర్త అబూ మొహమ్మద్ అంటున్నారు.12 నిమిషాల నిడివిగల వీడియోలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ను వినియోగించి పారిస్ ఈఫిల్ టవర్, నీస్ ట్రక్కుదాడి, మిషన్ ఇంపాజిబుల్-5 సినిమాలోని కొన్ని దృశ్యాలను కూడా పొందుపర్చారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







