ప్రధానితో ముగిసిన గవర్నర్ సమావేశం
- September 13, 2016
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి గవర్నర్ వివరించారు. ప్రధానంగా విభజన సమస్యలకు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. హైకోర్టు విభజన అంశంతో పాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళలోని సంస్థల విభజనపై చర్చించేందుకు ఈ నెల 14న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న సమావేశం గురించి ప్రధాని, గవర్నర్ మాట్లాడుకున్నట్లు తెలిసింది. కరవు, వర్షాల పరిస్థితి, ఏపీకి స్పెషల్ ప్యాకేజీ, కృష్ణానదిపై ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై ప్రధాని, గవర్నర్ చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







