రాధ- రాజశేఖర్ల 25వ పెళ్లిరోజు వేడుక..
- September 13, 2016
అలనాటి నాయికగా తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి రాధ. తెలుగులో సూపర్ డాన్సర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నప్పుడే నిర్మాత రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం కేరళలో స్థిరపడి సినిమాలకు విరామమిచ్చారు. ఇదిలా ఉండగా ఆమె కుమార్తె కార్తిక 'కో' చిత్రంలో నటించి మెప్పించారు. మరో కుమార్తె తులసి రెండు సినిమాల్లో నటించారు. ఇదిలా ఉండగా రాధ- రాజశేఖర్ల 25వ పెళ్లిరోజు వేడుక ఇటీవల తిరువనంతపురంలో ఘనంగా జరిగింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు చెన్నైలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు భారతిరాజా ముఖ్య అతిథిగా హాజరై రాధను ఆశీర్వదించారు. రాధను కథానాయికగా పరిచయం చేసింది భారతిరాజానే. అంతేకాకుండా సినిమాల కోసం ఆమెకు 'రాధ' అని పేరు పెట్టింది కూడా ఆయనే కావడం విశేషం.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







