అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో...

- September 13, 2016 , by Maagulf
అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో...

ఎన్టీఆర్.'అదుర్స్' సినిమాలో చారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. "గురువు గారు..గురువు గారు" అంటూ బ్రహ్మానందం చుట్టూ తిరిగే ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా నవ్వించింది. తాజాగా ఇదే తరహా పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడని అంటున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్‌ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్.
ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమాలో చారీగా ఎన్టీఆర్ ఇరగదీశాడు. ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ ఏపీసోడ్ అదిరిపోయింది. ఆ ట్రాక్ రాసింది హరీష్ శంకరేట. హరీష్‌ శంకర్‌ ఆ సినిమాకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాడట.ఇప్పుడు ఇలాంటి ట్రాక్ నే బన్నీ 'దువ్వాడం జగన్నాథం' కోసం కూడా రెడీ చేశారట.ఈ చిత్రంలో బన్నీ సరసన కాజల్ జతకట్టనుంది. దిల్ రాజు నిర్మాత. త్వరలోనే డిజె రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com