రోడ్డు ప్రమాదంలో తల్లి, చిన్నారి మృతి
- September 13, 2016
రస్ అల్ ఖైమా: మూడు నెలల చిన్నారి, ఆమె తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రెండు వాహనాలు సిగ్నల్ జంక్షన్ వద్ద ఒకదానితో ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెడ్ సిగ్నల్‌ని జంప్ చేసే క్రమంలో ఇంకో వాహనంతో ఢీ కొట్టి ప్రమాదానికి కారకుడయ్యారు మొదటి వాహనం నడుపుతున్న వ్యక్తి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. మృతి చెందిన చిన్నారి వయసు కేవలం 3 నెలలు మాత్రమే. చిన్నారి తండ్రి రెడ్ సిగ్నల్‌ని జంప్ చేసేందుకు ప్రయత్నించడం ఈ ప్రమాదానికి కారణం. రస్ అల్ ఖైమా పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ జనరల్ డైరెక్టర్, బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హమిది మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, లేదంటే ఇటువంటి ప్రమాదాల బారిన పడతారని హెచ్చరించారు. సిగ్నల్ జంపింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనకు భారీ జరీమానాలు, కఠిన శిక్షలు విధిస్తున్నా ప్రమాదాలు తగ్గకపోవడం, నిబంధనల ఉల్లంఘన ఆగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







