క్షణం మూవీలో 'ఈ క్షణం' అనే పాటకు థర్డ్ ప్రైజ్...
- September 14, 2016
అడవి శేషు, ఆదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం క్షణం. రవికాంత్ పెరుపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ చిత్రాన్ని వేరే భాషలలో కూడా రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారు కొందరు నిర్మాతలు. అయితే అబ్బే రోడ్ స్టూడియోస్ మరియు వరల్డ్ మ్యూజిక్ రికార్డింగ్ మ్యాగజైన్ సౌండ్ ఆన్ సౌండ్‌తో సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ అవార్డ్ పోటీలో క్షణం మూవీలోని 'ఈ క్షణం' అనే పాటకు థర్డ్ ప్రైజ్ దక్కినట్టు చెబుతున్నారు . ఈ చిత్రానికి శ్రీ చరణ్ పకాలా సంగీతం అందించగా, అనంత్ శ్రీకర్ ఈ క్షణం సాంగ్‌ని మిక్సింగ్ చేశారు.
వీరిద్దరి కృషి వలనే ఈ క్షణం అనే సాంగ్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ దక్కించుకుంది. రాబోవు రోజుల్లో ఈ టెక్నీషియన్స్ కి ఆ సంస్థలలో పనిచేసే అవకాశం కూడా దక్కనుందని సమాచారం. క్షణం సినిమాకి సంగీతం అందించిన శ్రీ చరణ్ పకాలా ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో బిజీగా ఉన్నట్టు టాక్. అక్కినేని హీరో సుమంత్ ఏక్ డోనార్ అనే చిత్రాన్ని రీమేక్ చేస్తుండగా ప్రస్తుతం ఈ చిత్రం కూడా అబ్బే రోడ్ స్టూడియోలో సాంగ్ మిక్సింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







