అఫ్ఘాన్ కు సాయం చేయనున్న భారత్

- September 14, 2016 , by Maagulf
అఫ్ఘాన్ కు సాయం చేయనున్న భారత్

అఫ్ఘనిస్థాన్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. విద్య, వ్యవసాయం, నైపుణ్యాలను పెంచేందుకు ఆదేశానికి అన్ని విధాలా సాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇండియాలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్, అఫ్ఘనిస్థాన్ లు సంయుక్తంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఆసియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవారికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని తీర్మానించాయి. ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.ఒక బిలియన్ డాలర్ల సాయంతో పాటు సోలార్ ఎనర్జీ, మెడిసిన్ లను సరసమైన ధరలకు అఫ్ఘాన్ కు అందించడానికి సహకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com