ఉత్తర పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ: ఆరుగురి మృతి

- September 14, 2016 , by Maagulf
ఉత్తర పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ: ఆరుగురి మృతి

ఉత్తర పాకిస్థాన్‌లోని ముల్తాన్‌ ప్రాంతంలో గురువారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. కరాచీకి వెళ్తున్న అవామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరోరైలుని ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 150 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com