ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల విడుదల....

- September 14, 2016 , by Maagulf
ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల విడుదల....

గత ఏడాది లిబియాలో కిడ్నాప్ అయిన తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టి.గోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన సి.బలరాం కిషన్ సురక్షితంగా విడుదల కావడంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లు ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల విడుదలను చేసినట్లు ఆమె తెలిపారు. సుమారు ఏడాదికిపైగా బందీలుగా ఉన్నవారు సురక్షితంగా విడుదలైనట్లు తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు సుష్మ గురువారం ట్విట్ చేశారు.2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అందులో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లను రెండు రోజుల్లోనే విడిచి పెట్టిన ఉగ్రవాదులు...కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరాం కిషన్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను విడుదల చేయలేదు. దీంతో దాదాపు ఏడాది పాటు వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవించిన విషయం తెలిసిందే. తమవారు సురక్షితంగా విడుదల కావటంతో బలరాం కిషన్, గోపీకృష్ణ కుటుంబాలు సంబరాల్లో ముగినిపోయాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com