వండర్ సిస్టర్స్ శ్రీదివ్య, క్రిష
- September 14, 2016
షార్జాలో నివసిస్తున్న శ్రీ దివ్య, క్రిష వండర్ కిడ్స్‌గా గుర్తింపు పొందారు. వడాలి వెంకట సాయి శ్రీదివ్య మరియు వడాలి వెంకట సాయి క్రిష రెండు అంతర్జాతీయ రికార్డులు సాధించారు. జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్‌లో చదువుతున్నారు ఈ ఇద్దర అక్కా చెల్లెళ్ళు. శ్రీదివ్య 12వ తరగతి చదువుతుండగా, క్రిష 4వ తరగతి చదువుతోంది. శ్రీ దివ్య మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు సంపాదించుకుంది. చదువుతోపాటు వివిధ అంశాల్లో ప్రతిభ చాటుకుంటున్న శ్రీదివ్య, పర్యావరణంపై అవగాహన కల్పించడం, అలాగే సేవా కార్యక్రమాల్ని చేపడుతుండడంతోపాటు ఎంతోమంది పిల్లల్ని ప్రోత్సహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. క్రిష కూడా తన అక్కబాటలోనే పయనిస్తోంది. పలు రంగాల్లో ఆమె బహుమతులు సాధిస్తోంది. నాట్యంలో క్రిషకి విశేష అనుభవం ఉస్త్రంది. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంటూ చిన్న వయసులోనే చాలా ప్రదర్శనలు ఇచ్చింది. వీరిరువురూ తమ ప్రతిభకు గుర్తింపుగా వండర్ బుక్ ఆఫ్ రికార్స్ ఇంటర్నేషనల్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ సంస్థల కో-ఆర్డినేటర్ అలమంద ప్రసాద్‌గారు ప్రశంసా పత్రాల్ని బహూకరించారు. ఈ సందర్భంగా తమ తల్లిదండ్రులు శ్రీకృష్ణ కిషోర్, శ్రీమతి పద్మజకు మరియు గురువులకు ధన్యవాదాలు తెలిపారు శ్రీదివ్య, క్రిష.


తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







