ఈ నెల‌ 23న ‘దెయ్యాల‌బండి’ వస్తోంది!

- September 15, 2016 , by Maagulf
ఈ నెల‌ 23న ‘దెయ్యాల‌బండి’ వస్తోంది!

గతంలో 5కల‌ర్స్‌ మల్టీమీడియా మూవీ పతాకంపై ఏకవీర, వెంటాడు-వేటాడు చిత్రాల‌ను నిర్మించారు శ్రీనివాస్‌ దామెర. తాజాగా 5కల‌ర్స్‌ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘హౌల్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాల‌బండి’ పేరుతో విడుద చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల‌ 23న ఇండియా వైడ్‌గా విడుదల‌వుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ దామెర మాట్లాడుతూ... ``conjuring 2,  lights out,  don't breathe చిత్రాల త‌ర‌హాలో వ‌స్తోన్న హ‌ర్ర‌ర్  చిత్రం `దెయ్యాల‌బండి``. ఈ చిత్ర క‌థ విష‌యానికొస్తే ...ఒక సిటీ నుంచి బయు దేరిన ప్యాసింజర్స్‌ ట్రైన్‌ హెవీ రైన్‌ కారణంగా దట్టమైన అడవుల్లో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో ఆ ట్రైన్‌ లోకి వింత వింత ఆకారాతో, హాహాకారాలు  చేస్తూ కొన్ని దెయ్యాలు ఆ ట్రైనులోకి ఎంటరై  అందులోని ప్యాసింజర్స్‌ని ఏ విధంగా చంపాయి?  ఏంటి? అన్నది సినిమా కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో హర్రర్‌ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్‌ ఫిలిం. హాలీవుడ్‌లో గతేడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల‌కు నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈ నె 23న ఇండియా వైడ్‌గా విడుద చేస్తున్నాం’’ అన్నారు. 
ఈడి స్పీర్స్‌, సీన్‌ పెర్ట్వి, హోలీ వెస్టన్‌, షౌనా మెక్‌నాల్డ్‌, ఇల్లియంట్‌ కాన్‌, కాల్విన్‌ డెన్‌, తదితరులు  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు:ఫౌల్‌హిత్‌, నిర్వహణ: రాధాకృష్ణ, నిర్మాత: శ్రీనివాస్‌ దామెర.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com