మీ మొబైల్ ఇవ్వరూ ...కాస్త మాట్లాడాలని మాయమైన దొంగ అరెస్ట్

- September 15, 2016 , by Maagulf
మీ మొబైల్ ఇవ్వరూ ...కాస్త మాట్లాడాలని మాయమైన దొంగ అరెస్ట్

మనామా:మహిళ నుంచి మొబైల్ దొంగతనం చేసిన కేసులో ఒక వ్యక్తికి మూడు నెలల కారాగార శిక్ష  హై క్రిమినల్ న్యాయస్థానం నిర్ధారించిన తీర్పుపై  సంతృప్తి చెందని నిందితుడు అప్పీల్ కోసం దాఖలు చేయగా అతని అభ్యర్ధనని కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే, మాయమాటలు చెప్పి ఓ 33 ఏళ్ల వ్యక్తి మహిళ నుండి మొబైల్ ఫోన్ దొంగిలించాడు. 

మూహ్యాయరాక్ వద్ద  ఒక చల్లని స్టోర్ వద్ద ఆ వ్యక్తి  బాధితురాలిని కలిసి ఒకసారి మొబైల్ లో మాట్లాడాలని తనకు ఫోన్ లేదని ...సెల్ ఫోన్ కోసం ఆమెని అభ్యర్థించినట్లు బాధితుడు తెలిపాడు. అందుకు జాలి పడిన ఆమె తన ఫోన్ ని ఆ వ్యక్తికి ఇచ్చింది.దాంతో అతను కాల్ చేస్తున్నట్లు నటిస్తూ, సిగ్నెల్ ఇక్కడ సరిగా  లేదని షాప్ బయటకు వచ్చేడు..ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్ తీసుకొని రెప్పపాటులో అక్కడ్నుంచి  పారిపోయాడు. దీనితో ఆ మహిళ  తేరుకొని... నేరుగా  పోలీసు స్టేషన్ కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. దోచుకున్న ఫోన్ యొక్క క్రమ సంఖ్య మీద నిఘా ఉంచిన పోలీస్ అధికారులు  ఆ వ్యక్తిని పట్టుకొని  ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com