ప్రముఖులు 'నిర్మలా కాన్వెంట్‌' ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు

- September 15, 2016 , by Maagulf
ప్రముఖులు 'నిర్మలా కాన్వెంట్‌' ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రియాశర్మ జంటగా నటించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్‌'. నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించారు. జి. నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిమ్మగడ్డ ప్రసాద్‌, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్‌ షోను బంజారాహిల్స్‌ పీవీఆర్‌లో ప్రదర్శించారు. ఈ షోకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, సాయికుమార్‌, తారకరత్న, తరుణ్‌, నాని, ఆది, ఛార్మి తదితరులు హాజరయ్యారు. సినిమాను వీక్షించిన అనంతరం రోషన్‌తోపాటు చిత్ర బృందాన్ని ప్రముఖులు అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com