కొల్హాపురి మటన్
- September 15, 2016
కావలసినవి: మటన్- అరకిలో, టొమాటో ముక్కలు- ఒకటి, ఉల్లిపాయ తరిగినది- ఒకటి, కొబ్బరి తురిమినది - అరచిప్ప, అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టీస్పూన్లు, మిరియాలు- నాలుగు లేక ఐదుగసగసాలు - రెండు టీ స్పూన్లు, ధనియాలు- రెండు టీ స్పూన్లు, పసుపు- ఒక టీ స్పూన్, గరమ్ మసాల పొడి- ఒక టీ స్పూన్, నూనె తగినంత.
తయారీ విధానం:
మటన్‌ని కడిగి శుభ్రం చేసి నీరు ఇగిరి పొడిగా అయిందాకా ఉడికించండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి , టొమాటో ముక్కలు, మిరియాలు, ధనియాలు మెత్తగా రుబ్బి పెట్టుకోండి. మూకుడులో నూనె వేడి చేసి మసాలా వేసి 7 లేక 8 నిమిషాలు నూనె తేలిందాకా వేగించండి. తర్వాత ఉడికించిన మటన్‌ని వేసి మసాల దానికి బాగా పట్టేలా కలియబెట్టండి. తరువాత తురిమిన కొబ్బరి వేసి మటన్ మసాలాని పూర్తిగా పీల్చుకునే దాకా ఉడికించండి. ఒకవేళ బాగా పొడిగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా నీరు చిలకరించండి. పూర్తిగా ఉడికిన తరువాత తీసి పరాఠాలతో కానీ చపాతీతోగానీ వడ్డించండి. దాదాపు మన మటన్ ఇగురు కూరే ఇది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







