దిగి వచ్చిన బంగారం ధర
- September 16, 2016
గత కొన్ని రోజులుగా ధరలు పెరిగి రూ. 31వేల మార్కును దాటిన బంగారం ధర కాస్త దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ధర తగ్గి రెండు వారాల కనిష్ఠానికి చేరింది. శుక్రవారం రూ. 70 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31వేలుగా ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,313.10 అమెరికన్ డాలర్లుగా ఉంది.
వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 350 తగ్గింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







