మోదీ పుట్టిన రోజు కేక్ గిన్నిస్ రికార్డు
- September 16, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే మూడు గిన్నిస్ బుక్ రికార్డులు, ఒక జాతీయ రికార్డు నెలకొల్పేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మోదీ కోసం రూపొందిస్తున్న పుట్టిన రోజు కేక్ సైతం ప్రపంచ రికార్డు సృష్టించనుంది. గుజరాత్‌లోని నౌసారిలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం తన 66వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సూరత్‌కు చెందిన ఓ బేకరీ స్థానిక స్వచ్ఛంద సంస్థతో కలిసి భారీ కేక్‌ను రూపొందించి గిన్నిస్ రికార్డు సృష్టించాలని ప్రయత్నిస్తోంది.
ఎనిమిది అడుగుల ఎత్తైన పిరమిడ్ ఆకారంలో నిర్వాహకులు కేక్‌ను రూపొందిచనున్నారు.ఇప్పటి వరకు పోలాండ్‌లోని ఎమ్‌టీఆర్ జెస్‌జో అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆరు అడుగుల ఎత్తు, 720.8 కిలోల బరువైన కేక్‌పై ఈ రికార్డు ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించాలని వారు భావిస్తున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది అడుగుల ఎత్తు, 12 అడుగుల పొడవు, రెండు నుంచి 2.5 టన్నుల బరువు ఉండే అతి పెద్ద కేక్‌ను తయారు చేయనున్నారు. అతుల్ బేకరీకి చెందిన 20 మంది నలభీములు దీన్ని తయారు చేయనున్నారు.
నౌసారిలో 11,223 మంది దివ్యాంగులకు వివిధ సహాయ పరికరాలను ప్రదానం చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







