తుర్కెమెనిస్థాన్ రాజధాని లో పక్షి ఆకారం విమానాశ్రయం
- September 17, 2016
తుర్కెమెనిస్థాన్ రాజధాని అష్గబత్‌లో శనివారం పక్షి ఆకారంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగ్లీ బెర్డోముఖామెడోవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇందులో రెండు ప్యాసింజర్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 17 మిలియన్ల మంది ప్రయాణించే సామర్థ్యం ఉండేలా దీన్ని నిర్మించారు. అంతేకాకుండా రెండు లక్షల టన్నుల సరుకును రవాణా చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఐదు అంతస్థుల ఈ విమానాశ్రయం పక్షి రెక్కలు విప్పుకున్నట్లు ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని నిర్మించేందుకు దాదాపు 2 బిలియన్ల డాలర్లు వ్యయమైనట్లు తుర్కెమెనిస్థాన్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







