హజ్ యాత్రీకులకు ఘనస్వాగతం
- September 17, 2016
కువైట్: 700 మంది సెక్యూరిటీ సిబ్బంది, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని పలు ప్రాంతాల్లో హజ్ నుంచి తిరిగివస్తున్న యాత్రీకులకు సహాయపడేందుకు నియమించబడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) ఈ వివరాల్ని వెల్లడించింది. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్ పెట్రోల్స్ ఇప్పటికే తమ కార్యకలాపాల్ని ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్‌ల వద్ద, మల్టీ స్టోరీ పార్కింగ్ వద్ద మోహరించి, రౌండ్ ద క్లాక్ సేవలు అందించనుంది. మినిస్ట్రీకి చెందిన పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అలాగే మినిస్ట్రీ కస్టమ్స్ కౌంటర్స్‌ని పెంచి, రద్దీని తట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇంకో వైపున ఇ-బ్రాస్లెట్ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయ్యిందనీ, దీని ద్వారా జిపిఎస్ సహాయంతో యాత్రీకులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, వారికి తగిన సహాయ సహకారాలు అందించగలిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్, అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ యూకుబ్ అల్ సనీయా ఇ-బ్రాస్లెట్ విధానం చాలా అద్భుతంగా పనిచేసినట్లు వివరించారు. ఇకపైన కూడా హజ్ యాత్రీకులకు ఈ విధానం ద్వారా సేవలందిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







