హజ్‌ యాత్రీకులకు ఘనస్వాగతం

- September 17, 2016 , by Maagulf
హజ్‌ యాత్రీకులకు ఘనస్వాగతం

కువైట్‌: 700 మంది సెక్యూరిటీ సిబ్బంది, కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లోని పలు ప్రాంతాల్లో హజ్‌ నుంచి తిరిగివస్తున్న యాత్రీకులకు సహాయపడేందుకు నియమించబడ్డారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ (ఎంఓఐ) ఈ వివరాల్ని వెల్లడించింది. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్‌ పెట్రోల్స్‌ ఇప్పటికే తమ కార్యకలాపాల్ని ఎయిర్‌పోర్ట్‌ ఎంట్రన్స్‌ల వద్ద, మల్టీ స్టోరీ పార్కింగ్‌ వద్ద మోహరించి, రౌండ్‌ ద క్లాక్‌ సేవలు అందించనుంది. మినిస్ట్రీకి చెందిన పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అలాగే మినిస్ట్రీ కస్టమ్స్‌ కౌంటర్స్‌ని పెంచి, రద్దీని తట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇంకో వైపున ఇ-బ్రాస్‌లెట్‌ ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందనీ, దీని ద్వారా జిపిఎస్‌ సహాయంతో యాత్రీకులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, వారికి తగిన సహాయ సహకారాలు అందించగలిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మినిస్టర్‌ ఆఫ్‌ జస్టిస్‌, అవ్‌కాఫ్‌ మరియు ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ యూకుబ్‌ అల్‌ సనీయా ఇ-బ్రాస్‌లెట్‌ విధానం చాలా అద్భుతంగా పనిచేసినట్లు వివరించారు. ఇకపైన కూడా హజ్‌ యాత్రీకులకు ఈ విధానం ద్వారా సేవలందిస్తామని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com