ఘనంగా మోహన్‌బాబు 40 వసంతాల నట ప్రస్థాన వేడుక
- September 17, 2016
మో హన్బాబుకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులున్నారని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ పి.జె.కురియన్ అన్నారు. శనివారం రాత్రి విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నటుడు మోహన్‌బాబు 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని టి.సుబ్బరామిరెడ్డి లలిత కళపరిషత్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.
మోహన్‌బాబుకు టి.ఎస్.ఆర్. లలిత కళా పరిషత్ తరపున టి.సుబ్బరామిరెడ్డి 'నవరస నట తిలకం' బిరుదును ప్రదానం చేశారు. మోహన్‌బాబుకు చిరంజీవి స్వర్ణ కంకణాన్ని బహుకరించారు. మోహన్‌బాబు ఫొటో పుస్తకాన్ని శ్రీదేవి ఆవిష్కరించారు. పెదరాయుడు చిత్ర ఫొటోల పుస్తకాన్ని సినీనటుడు వెంకటేశ్, రాఘవేంద్రరావు తదితరులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కురియన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో 40 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అసామాన్య విషయమన్నారు. మోహన్‌బాబు మరో 40 సంవత్సరాలు విజయవంతంగా చిత్ర సీమలో రాణిస్తారని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమలో దమ్మున్న నటుడు మోహన్‌బాబు అని పేర్కొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ''నా ఆప్తుడు మోహన్‌బాబు. ఇక్కడ సన్మానం జరుగుతున్నది మోహన్‌బాబుకి కాదు. క్రమశిక్షణకి, కష్టానికీ, పట్టుదలకీ జరుగుతున్న సన్మానిది. మనసులో గట్టిగా అనుకొంటే సాధించలేనిది ఏదీ లేదని మోహన్‌బాబు నిరూపించారు. నాదీ, ఆయనదీ సమాంతరంగా వస్తున్న సుదీర్ఘ ప్రయాణం. సినీ ప్రవేశం పూల పూన్పు కాదు, ముళ్లబాట. భవిష్యత్తు ఏమవుతుందనే అయోమయం ఉంటుంది. కష్టం అనే ఆయుధాన్ని చేత్తో పట్టుకొని దూసుకెళ్లాడు మోహన్‌బాబు. మోహన్‌బాబు నిజంగా ఒక పర్వతం. ఆయన పలికిన డైలాగుల్ని పుస్తకంగా వేశారు. ఆ పుస్తకాన్ని లండన్ పార్లమెంట్లో ఆవిష్కరించారు. అదొక గొప్ప గౌరవం. తన చిత్ర ప్రయాణానికి సంబంధించిన పుస్తకానికి నన్ను ముందు మాట రాయమన్నారు. అది మోహన్‌బాబు నాకు ఇచ్చిన ఓ గౌరవంగా భావిస్తా. మా ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు ఉన్నట్టుగా, మేమేదో టామ్ అండ్ జెర్రీ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. మా మనసుల్లో అలాంటిదేమీ ఉండద''న్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమిది. మోహన్‌బాబు నలభయ్యేళ్ల సుదీర్ఘ చరిత్రకి సన్మానం చేశారు. ఒక మనిషి ఒక సామాన్యుడు అనుకొంటే ఏ స్థాయికి చేరుతాడో చెప్పడానికే ఈ వేడుక. ఇవాళ వస్తున్న తరం చూస్తుంటే ఐదేళ్లకే అలసిపోతున్నారు. పదేళ్లు చాలనుకొంటున్నారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్లల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్నవాళ్లే ఉన్నారు. మనిషి ప్రతిభ అనేది రెండోది, క్రమశిక్షణే మొదటిది. పరిశ్రమలో ఎక్కువకాలం నిలబడ్డవాళ్లంతా కృషితో పైకొచ్చినవాళ్లే. ఇలాంటి వేడుకల్ని టి.సుబ్బరామిరెడ్డి్డలాంటి వాళ్లు చేయకపోతే కళాకారుల గొప్పతనం ఎలా తెలుస్తుంది? మోహన్‌బాబుని నేనే పరిచయం చేశా. కేవలం పరిచయం చేసినంత మాత్రానో, నాలుగు సినిమాలు ఇచ్చినంత మాత్రానో ఒకరు ఎదగరు. ఏ క్రమశిక్షణనైతే నమ్మాడో అదే మోహన్‌బాబుని చరిత్రకారుడిని చేసింది. మోహన్‌బాబు వ్యక్తిత్వం విలక్షణమైనది. అతను ఎదుటివారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. నాకు తెలిసి పరిశ్రమలో మోహన్‌బాబుతోనే ఎక్కువ మంది స్నేహం చేస్తారు. మోహన్‌బాబు నలభయ్యేళ్ల నట ప్రయాణం పూర్తి చేసుకోవడమనేది అతని పరిచయం చేసిన ఒక గురువుగా నా కంటే ఆనందపడేవాడు మరొకడు ఉండడ''న్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ''మోహన్‌బాబుగారు నలభయ్యేళ్ల సినీ ప
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







