ఉత్తమ చిత్రంగా కంచె......!
- September 18, 2016
భరతముని ఫిల్మ్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా కంచె సినిమా ఎంపిక అయింది. ఫెస్టివల్ వివరాలను భరతముని ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు రొమ్మాల మునికృష్ణారెడ్డి ప్రకటించా రు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు ఉత్తమ నటీనటులు, సాంకేతిక వర్గానికి అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు.అవార్డుల ఎంపికలో రన్నింగ్, బాక్స్ ఆఫీస్ హిట్ తదితర విషయాలనే కాకుండా చక్కని కళాత్మక విలువలు, సహజ చిత్రాలు, సామాజిక శ్రేయస్సు, సంప్రదాయం, జాతీయ సమైక్యత లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్‌లో హైదరాబాదులో జరుగుతుందన్నారు.ఉత్తమ చిత్రంగా కంచె, సందేశాత్మకచిత్రం దాగుడుమూతలు, హాస్య చిత్రం భలేభలే మగాడివోయ్, చారిత్రాత్మకచిత్రం రుద్రమదేవి, ప్రజాదరణ చిత్రం బాహుబలి, ఉత్తమ నటుడు రాజేంద్రప్రసాద్, ప్రత్యేక ప్రశంసానటుడు వరుణ్‌తేజ్, నటి అనుష్క, విలన్‌గా తనికెళ్ల భరణి ఎంపికయ్యారు. వివిధ కేటగిరీల్లో కూడా అవార్డులను ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







