ఎయిర్‌పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది..

- September 18, 2016 , by Maagulf
ఎయిర్‌పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది..

 ఉగ్రదాడి అనంతరం దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో ఆర్మీ బెటాలియన్‌ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాడి తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. ఎల్‌వోసీ సహా బారాముల్లా, యూరీ సెక్టార్‌లో రహదారులను మూసివేత వేశారు. ఈ ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షాసమావేశానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్, ఐబీ చీఫ్‌, డిఫెన్స్‌ సెక్రటరీ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌, సీఎంతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలుసుకున్నారు. రాజ్‌నాథ్‌సింగ్ అమెరికా, రష్యా పర్యటన వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com