జాగ్వర్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా పవన్
- September 18, 2016
మాజీ ప్రధాని మనవడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు.. నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం అవుతోన్న భారీ చిత్రం జాగ్వర్. ఈ సినిమా ఆడియో వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను ఆదివారం హైదరాబాద్ లోని నొవాటెల్ హోటల్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను కూడా అదే స్థాయిలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుక హాజరవుతుండటంతో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హజరవుతారని భావిస్తున్నారు. దీనికి తోడు హీరో నిఖిల్ కుమార్ రాజకీయా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తుండటంతో రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో భద్రతా పరంగా కూడా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మిత్రుడు సినిమాను డైరెక్ట్ చేసిన మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







