"తాలింపు" రెస్టారెంట్ ఘనమైన ఆఫర్..
- September 18, 2016
అచ్చ తెలుగుదనంతో అమీర్ పేటలో ఆవిష్కృతమైన "తాలింపు" రెస్టారెంట్ సెప్టెంబరు మూడో ఆదివారం (సెప్టెంబరు 18) రోజున వైఫ్ అప్రిసియేషన్ డేను ఘనంగా జరుపుకుంటోంది. ప్రతి ఏటా ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా భార్యను పొగిడే దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని "తాలింపు" రెస్టారెంట్ ఘనమైన ఆఫరును ప్రకటిస్తోంది.
ఈ ఆఫరులో పాల్గొనాలంటే భార్యను పొగుడుతూ ఒక కవిత రాయాల్సి ఉంటుంది. ఆ కవిత నిడివి కనీసం ఆరు లైన్లు ఉండాలి. గరిష్టంగా ఎన్నిలైన్లయినా ఉండొచ్చు. మీరు రాసిన కవితను తీసుకుని మీ జీవిత భాగస్వామితో పాటు "తాలింపు" రెస్టారెంటుకు వస్తే మీరు చేసే బిల్లుపైన పది శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఒక షరుతు ఏంటంటే... ఈ కవితను మా రెస్టారెంటులో మీ భార్యకు చదివి వినిపించాలి!. ఈ వేడుక ఈ ఆదివారం మాత్రమే. భార్యను సంతోష పెట్టడానికి ఇంతకంటే మంచి సులువైన మార్గం ఏమైనా ఉంటుందా. భార్యామణులకు భర్తతో పొగిడించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడంతో పాటు ఈ వీకెండ్ మీ రెస్టారెంటు బిల్లును పదిశాతం తగ్గించుకునే అవకాశం కూడా కలుగుతుంది. మరింకేంటి ఆలస్యం ఎక్కువ టైం లేదు. గెట్ రెడీ.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







