ఫలించిన భారత్ ప్రయత్నాలు
- September 20, 2016
అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి అజిత్ కుమార్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఒకపక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, మరోపక్క ఉగ్ర మూకలను భారత్ లోకి అక్రమంగా జొప్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న ప్రసంగాలను కూడా ఆయన తప్పు పట్టారు. ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని స్పష్టమవుతోందన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో బహిరంగంగానే ర్యాలీలు నిర్వహించడం ప్రపంచం చూస్తోందన్నారు. కాగా, అగ్ర దేశాలు, ఇతర మిత్ర దేశాల నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన తర్వాతే భారత రాయబారి ఈ స్థాయిలో స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







