హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 115 ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై సేవలు !
- September 20, 2016
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 115 ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరో వారం రోజుల్లోనే ఈ వైఫై సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. ఏసీ బస్సులు ఎక్కే ప్రయాణికులు మొదటి 25 నిమిషాలు ఉచితంగా వైఫై సేవలు పొందవచ్చని ఆయన చెప్పారు. 25 నిమిషాల తర్వాత కూడా వైఫై వాడాలనుకునే ప్రయాణికులు సాధారణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ చార్జీలపై బస్సులలో ప్రకటనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైఫై సేవలు అందించేందుకు రూరల్ ఇండియా సంస్థ ముందుకు వచ్చిందన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని కొత్త ప్రణాళికలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







