రాస్ తానురాలో అగ్ని ప్రమాదం 8 మంది కార్మికులకు గాయాలు
- September 20, 2016
జెడ్డా : సౌదీ అరంకో చమురు టెర్మినల్ ఫెసిలిటీ రాస్ తానురా లో మంగళవారం ఉదయం జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపదినట్లు సంబంధిత కంపెనీ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలోతెలిపింది. ఉదయం 9 గంటల సమయంలో అగ్నిఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడున్నవారిని బలవంతంగా తరలించడం జరిగింది.తీవ్రమైన నష్టం కలిగించక ముందే అగ్నిమాపకదళం అత్యవసర పరిస్థితికి అనుగుణంగా స్పందించి అగ్నిని అదుపు చేశారు.
అరంకో చమురు ఉద్యోగులు మరియు ఆరుగురు కాంట్రాక్టర్లు ఈ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. వీరందరూ వైద్య చికిత్స పొందారని తెలిపారు. ఈ స్వల్ప అగ్ని సంఘటన కారణంగా చమురు మరియు వాయువు కార్యకలాపాలని ప్రభావితం చేయ లేదని అరంకో ప్రతినిధి అన్నారు. రాస్ తానురా టెర్మినల్ రోజుకు 550,000 బ్యారళ్ల ముడి చమురుని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఇంకా ఏమీ తెలియ రాలేదని కారణం కనుగోవడానికి ఒక పరిపూర్ణమైన దర్యాప్తు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







