వలసదారుడి ఇంట్లో భారీ చోరీ
- September 20, 2016
మనామా: ఓ వలసదారుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు, ఇంట్లోకి ప్రవేశించి విలువైన బంగారు నగల్ని దోచుకున్నారు. అయితే ఈ దోపిడీ క్షణాల్లో జరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యోగేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశిస్తున్నాడు ఆ ఇంట్లో. పది నిమిషాల సమయంలోనే ఈ దోపిడీ జరిగిపోయినట్లు యోగేష్ వివరించారు. తన భార్య పది నిమిషాల పాటు వేరే పని మీద బయటకు వెళ్ళడంతో, దొంగలు ఇదే సరైన సమయమని భావించి, ఆ సమయంలో దోపిడీకి పాల్పడినట్లు యోగేష్ పోలీసులకు తెలిపాడు. ఎప్పటినుంచో తన భార్య కదలికల్ని, ఇంటి పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించినవారే దోపిడీ చేసి ఉంటారని యోగేష్ అనుమానం వ్యక్తం చేశారు. కిచెన్ రూమ్‌లోని విండో ద్వారా దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే అపార్ట్మెంట్లోకి చొరబడేందుకు భారీ నిచ్చెన అవసరం అవుతుందని, దొంగలు వచ్చి వెల్ళిన తీరు విస్మయం కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. పోలీసులు అపార్ట్మెంట్ వాసుల్ని అడిగి దొంగతనం జరిగిన తీరుని తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







