హీరో రానా మరో రికార్డ్ సాధించాడు
- September 21, 2016
హీరోగా, విలన్ గా అలరిస్తున్నటాలీవుడ్ యంగ్ హీరో రానా మరో రికార్డ్ సాధించాడు. సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ టాల్ హీరో ట్విట్టర్ లో ఏకంగా 20 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో సత్తా చాటాడు. దాదాపు యంగ్ జనరేషన్ టాలీవుడ్ హీరోలందరూ పదిలక్షల మంది ఫాలోవర్స్ కు కాస్త అటు ఇటుగా కొనసాగుతుండగా రానా మాత్రం 20 లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. తనకు ఈ అరుదైన రికార్డ్ ను అందించిన అభిమానులకు రానా కృతజ్ఞతలు తెలియజేశాడు.
24 లక్షల మంది ఫాలోవర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే రానా కన్నా ముందున్నాడు. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న రానా, ఆ సినిమాతో పాటు సబ్ మెరైన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ రెండు సినిమాల తరువాత తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే పొలిటికల్ థ్రిల్లర్ కు ఓకె చెప్పాడు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







