80 జాబ్ కేటగిరీస్ - డ్రైవింగ్ లైసెన్సుల నుంచి ఔట్
- September 21, 2016ఖతార్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) కొత్తగా 80 జాబ్ కేటగిరీస్‌ని డ్రైవింగ్ లైసెన్సుల నుంచి తొలగించింది. ఖతార్‌లో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించేందుకు ఈ చర్యల్ని తీసుకున్నారు. తొలగించిన జాబ్ కేటగిరీస్‌లో మొత్తం 150 వరకు ప్రొఫెషన్స్ ఉంటాయని అంచనా. ఇప్పటికే దీనికి సంబంధించిన లిస్ట్‌ని విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గ్రాసర్, న్యూస్ పేపర్ వెండర్, బార్బర్, సర్వెంట్, కాస్మొటాలజిస్ట్, సెక్యూరిటీ గార్డ్, పోర్టర్, షెపర్డ్, బచర్, టైలర్, గోల్డ్ స్మిత్, అగ్రికల్చర్ వర్కర్, డెకరేషన్ అలాగే మైనింగ్ టెక్నీషియన్, బ్యూటీషియన్, మెకానిక్ తదితరులు ఈ కేటగిరీలో ఉన్నారు. ఈ కేటగిరీలోనివారికి స్పాన్సరింగ్ సంస్థలు రవాణా సౌకర్యాల్ని కల్పించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో డ్రైవింగ్ లైసెన్సుల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ డ్రైవింగ్ స్కూల్ యజమాని చెప్పారు.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







