పాక్‌ను ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా అమెరికాలో బిల్లు
- September 21, 2016
పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్‌ను ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా నిర్దేశిస్తూ అమెరికాలోని ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన టెడ్ పో, డెమోక్రాట్, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడైన డానా రోహ్రబచర్ సంయుక్తంగా హెచ్ ఆర్ 6069 అనే బిల్లును సభ ముందుకు తెచ్చారు. అమెరికాను వంచించిన పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉగ్రవాదంపై హౌస్ సబ్ కమిటీ సభ్యుడైన టెడ్ అన్నారు. అమెరికాకు మిత్ర దేశంగా ఉంటూ శత్రు దేశాలకు సహాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.
బిన్ లాడెన్ వంటి ప్రమాదకార టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం ఉగ్రవాదనికి పాకిస్థాన్ కొమ్ముకాస్తోందనడానికి నిదర్శమని టెడ్ పో అన్నారు.
పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తోందా లేదా అన్నదానిపై అధ్యక్షుడు ఒబామా పాలక వర్గం 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, ఆ తర్వాత 30 రోజుల్లో కార్యదర్శి జాన్ కెర్రీ దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. మరో కాంగ్రెస్ సభ్యుడు పీట్ ఓల్సన్ ఉరీ ఘటనను ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్న వారిని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రతి చర్యకు తాను మద్దతిస్తానని ఆయన అన్నారు. మరో సభ్యుడు జాన్ కార్నిన్ కూడా పాక్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







