మోదీ రోజంతా వార్‌ రూమ్‌లో ...

- September 21, 2016 , by Maagulf
మోదీ  రోజంతా వార్‌ రూమ్‌లో ...

ఉరీ దాడి నేపథ్యంలో.. పాక్‌తో 'కంటికి కన్ను పంటికి పన్ను' తరహాలో వ్యవహరించాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై ప్రధాని మోదీ బుధవారం రోజంతా వార్‌ రూమ్‌ (ఆర్మీ తాలూకూ మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌)లో అత్యున్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. వార్‌రూమ్‌గా వ్యవహరించే ఈ అత్యంత రహస్యమైన కార్యాలయం నుంచే రక్షణ శాఖ అన్ని భద్రతాపరమైన అంశాలనూ పర్యవేక్షిస్తుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా.. ఆ రూమ్‌లోనే ఉన్న పీఎం బుధవారం నాడూ భద్రత వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీతో అక్కడే రెండుసార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.ఉరీ దాడికి ఎలా స్పందించాలో కేంద్ర కేబినెట్‌లోని కీలక మంత్రులతో, ఆర్మీ చీఫ్‌తో కార్యాచరణపై చర్చించారు. మ్యాప్‌లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, సైకత నమూనాల ఆధారంగా మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఆయనకు పలు వివరాలు తెలియజేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com