కాటమరాయుడు షూటింగ్ మొదలైంది..

- September 21, 2016 , by Maagulf
కాటమరాయుడు షూటింగ్ మొదలైంది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్ మొదలైంది. బుధవారం సికింద్రాబాద్ జూబిలీ బస్టాండ్ లో కొన్ని సీన్స్ చిత్రీకరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 రోజులపాటు తొలి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ నెల 23 నుంచి పవన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఫిట్ నెస్ కోసం ఈ హీరో తన ట్రైనర్లతో దిగిన ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. కామెడీ, యాక్షన్ లవ్ స్టోరీతో కూడిన కాటమరాయుడు మూవీలో శృతి హసన్ హీరోయిన్. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి యామినీ భాస్కర్ కీలక రోల్ పోషిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ శరత్ మరార్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. జనసేన అధినేత మళ్ళీ రీల్ లైఫ్ స్టార్ట్ చేసినట్టే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com