తొలి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు..
- September 21, 2016
న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్‌కు చరిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కెప్టెన్ కోహ్లి తుదిజట్టును ఎంచుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో నిరాశపరిచిన ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులో స్థానం కోల్పోగా.. యువ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌పై కెప్టెన్ విశ్వాసం ఉంచాడు.
భారత్ జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్
న్యూజిలాండ్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్,) లాథమ్, మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, లూక్ రోంచి, శాంట్నర్, వాట్లింగ్ (వికెట్ కీపర్), మార్క్ క్రేగ్, ఇష్ సోది, వాంగర్, ట్రెంట్ బౌల్ట్
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







