మహేష్ మురగదాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..

- September 21, 2016 , by Maagulf
మహేష్ మురగదాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..

మహేష్ బాబు - మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 20 రోజులుగా చెన్నై కొనసాగుతోంది. ఈవీపీ వరల్డ్‌లో వేసిన ఓ భారీ సెట్స్‌లో సన్నివేశాలను చిత్రీకరించారు. రేపటి (గురువారం)తో చైన్నై షెడ్యూల్ పూర్తవ్వనుంది. తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.ఇదివరకే వేసిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, అవసరాల 'జ్యో అచ్చుతానంద' సెట్స్ లో కొన్ని సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. అయితే, ఈ సెట్స్ లో స్వల్ప మార్పులతో తనకు అనుకూలంగా మార్చుకోనుంది మహేష్ సినిమా యూనిట్.మహేష్ మురగదాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది.దర్శకుడు ఎస్ జె సూర్య మహేష్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లోనూ రిలీజ్ చేయనున్నాడు. దీపావఌ కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com