'దొడ్మనేహుడుగ' సినిమా చూస్తే.. బిర్యానీ ఫ్రీ !
- September 21, 2016
పవర్ స్టార్ సినిమా చూస్తే బిర్యానీ ఫ్రీ. అలాగని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనుకునేరు. ఈ మేటరు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా గురించి. పునీత్ రాజ్‌కుమార్, రాధికా పండిట్లు జంటగా నటించిన చిత్రం 'దొడ్మనేహుడుగ'. దునియా సూరి దర్శకుడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా అభిమానులు వినూత్న ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. 'దొడ్మనేహుడుగ' వీక్షించే ప్రేక్షకులకి బిర్యానీ, లడ్డూలని ఫ్రీగా పంపిణీ చేయనున్నారు. అదీ కూడా.. మొదటి షోని వీక్షించే ప్రేక్షకులకు మాత్రమే. ఈ చిత్రంలో హీరో పునీత్ రాజ్‌కుమార్ రోడ్డుపై బిరియానీ తయారు చేసే పాత్రలో కనిపించనున్నాడు.అందుకే.. ఫ్రీ బిర్యానీ పంపిణీని తెరపైకి తీసుకొచ్చారు. మొత్తానికి.. పవర్ స్టార్ సినిమా చూస్తే..బిర్యానీ ఫ్రీ గా పొందవచ్చన్నమాట.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







