గోల్డ్ గ్యాంగ్ ఆటకట్టు
- September 21, 2016
మస్కట్: గత నెలలో ముట్రా గోల్డ్ సౌక్‌లోని జ్యుయెలరీ స్టోర్‌లో జరిగిన భారీ దొంగతనం అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ గ్యాంగ్ భారీ మొత్తంలో గోల్డ్‌ని దోచుకుని, దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. దాంతో, రాయల్ ఒమన్ పోలీసులు పకడ్బందీ వ్యూహం రచించారు. మొత్తం అన్ని రవాణా మార్గాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 37 కిలోల బంగారంతో నిందితులు దేశం నుంచి బయటకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఇప్పటిదాకా ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించడం జరిగింది. గ్యాంగ్‌లో అందరూ ఆసియాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు విమానాశ్రయం ద్వారా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని ట్రాక్ చేసిన పోలీసులు చాకచక్యంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇంకో వైపున సముద్ర మార్గంగా పారిపోయేందుకు ప్రయత్నించినవారినీ పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







