యాక్సిడెంట్ బాధితుల ఫొటోలు, వీడియోలపై ఉక్కుపాదం
- September 22, 2016
ప్రమాదాల్లో మరణించిన లేదా తీవ్రంగా గాయపడ్డవారి ఫొటోల్ని, వీడియోల్ని పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ పీనల్ కోడ్‌లో సవరణలకోసం అడ్వయిజరీ కౌన్సిల్‌కి క్యాబినెట్ రిఫర్ చేసింది. ప్రచారం చేసినవారినే కాకుండా షేరింగ్ చేయడం, ఏ రకంగా అయినా క్లిక్ చేయడం వంటిని కూడా నేరంగా పరిగణించి, పెనాల్టీ విధించనున్నారు ఈ కొత్త అమెండ్మెంట్ ద్వారా. ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని సూచనల మేరకు పీనల్ కోడ్‌లో అమెండ్మెంట్ జరగనుంది. ప్రమాదాల్లో బాధితుల ఆవేదన వర్ణనాతీతం అనీ, ఆ సమయంలో వారి ప్రైవసీకి ఇబ్బందులు కలిగించడం, ఆ ఫొటోల్ని చూసి ఇతరుల్ని భయకంపితుల్ని చేయడం వంటివి మానవీయం కాదని అధికారిక వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే ఇలాంటి చర్యలను ఇప్పటికే నేరంగా పరిగణిస్తుండగా, లైక్ చేయడం షేర్ చేయడం వంటివాటికీ కఠినమైన పెనాల్టీలు విధించనున్నారు కొత్త చట్టం ద్వారా.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







