ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటా: ఎస్.జానకి
- September 22, 2016
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా వివిధ భాషల్లో దాదాపు 48,000 పాటలను ఆలపించిన మధుర గాయని ఎస్. జానకి ఇక రిటైరవుతున్నట్లు ప్రకటించారు. 59 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్‌కు మలయాళ పాటతో ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. '10 కల్పనకల్' అనే మలయాళ చిత్రం కోసం తాను పాడే జోలపాటే చివరిదని పేర్కొన్నారు. 'ఇక పాటలు చాలనుకుంటున్నా. చాలా భాషల్లో పాడాను. పెద్దదాన్నయిపోయాను.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. మలయాళ పాటతో మానేయాలని ప్రత్యేకంగా అనుకోలేదు.. అనుకోకుండా జరిగింది అంతే.. అది లాలి పాట.. నా మనసుకు చాలా నచ్చింది' అని జానకి ఓ ఆంగ్లపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.వేడుకల్లో సైతం ఇక పాడబోనని ఆమె చెప్పారు.
గుంటూరులో జన్మించిన జానకి 1957లో తమిళ సినిమాతో గాయనిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా, జానకి కలయికలో వచ్చిన పాటలు శ్రోతలను చాలా ఆకట్టుకున్నాయి. ఉత్తమ గాయనిగా జానకికి 4 జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు లభించాయి.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







