సౌదీకి అమెరికా ఆయుధాలు విక్రయించే ఒప్పందం
- September 22, 2016
సౌదీ అరేబియాకు 1.15బిలియన్ డాలర్ల విలువ చేసే యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధాలు విక్రయించే ఒప్పందాన్ని అమెరికా సెనేట్ బుధవారం అంగీకరించింది. రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్, డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీలు సహా కొందరు సెనేటర్లు ఈ డీల్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికే ఎక్కువ ఓట్లు ఆయుధాల విక్రయానికే పడడంతో ఒప్పందానికి ఆమోదముద్ర పడింది. సౌదీ ఇస్లాం బ్రాండ్‌ను విస్తరిస్తోందంటూ ఈ డీల్‌ను వ్యతిరేకించిన సెనేటర్లు వాదించారు.
సౌదీ అరేబియాకు 130 అబ్రామ్ యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధ సామాగ్రి విక్రయానికి దేశ హోంశాఖ అంగీకరించిందని గతంలోనే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది.
సౌదీతో ఆయుధాల విక్రయ ఒప్పందానికి జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ కాంట్రాక్టర్‌గా ఉంటుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







