'బహమాస్' లీక్స్‌లో తెలుగు ప్రముఖులు
- September 22, 2016
పనామా' లీక్స్ తరహాలోనే 'బహమాస్' లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. బహమాస్ లీక్స్ పేరుతో అక్రమార్కుల డేటాను ఇంటర్నేషనల్ కనార్షియం ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఐసీఐజే) బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 75 వేల మంది ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
బహమాస్ లీక్స్ వివరాలను జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. బహమాస్ లీక్స్ నల్లకుబేరుల గుట్టుని రుట్టు చేస్తున్నాయి. ఒక్క భారత్ నుంచి 475 మంది పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా బహమాస్ లీక్స్ పేర్కొంది.
దీంతో మన దేశంలో 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలయ్యాయి.
బహమాస్ లీక్స్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. బహమాస్‌కు చెందిన పలు కంపెనీల్లో నల్లధనం పేరిట పెట్టబడులు పెట్టినట్లుగా బహమాస్ లీక్స్‌లో ఐసీఐజే వెల్లడించింది. గతంలో పనామా లీక్స్ ద్వారా వందల మంది అక్రమాస్తుల డేటాను ఐసీఐజే బయటపెట్టిన సంగతి తెలిసిందే.
బహమాస్ లీక్స్‌లో వేదాంద గ్రూప్‌కు చెందిన అనీల్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఓ ప్యాషన్ టీవీ అధినేత పేరు కూడా ఉన్నట్లు బహమాస్ లీక్స్ ద్వారా వెల్లడైంది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల్లో కొందరు సికింద్రాబాద్‌లోని ఒకే అడ్రస్ నుంచి 20 సంస్థలున్నట్లు 'బహమాస్ ' లీక్స్ బయటపెట్టింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







