పారాలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలిసిన మోదీ
- September 22, 2016
బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలుసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రియోలో భారత జాతి గౌరవాన్ని చాటి చెప్పిన క్రీడాకారులను ఆయన అభినందిస్తూ వారితో కలిసి తీసుకున్న ఫొటోలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ పోటీల్లో గొప్ప విజయం సాధించిన క్రీడాకారుల్ని అభినందిస్తూ.. వారు ఈ విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నాన్ని మోదీ కొనియాడారు.
సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు జరిగిన రియో పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్లు మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర ఝఝరియా స్వర్ణ పతకాలు సాధించగా, వరుణ్‌సింగ్ భటి కాంస్యం, దీపా మాలిక్ రజత పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







