దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గరలో డైవర్షన్స్‌

- September 23, 2016 , by Maagulf
దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గరలో డైవర్షన్స్‌

దుబాయ్: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కి దగ్గరలో నిర్వహణ పనుల నిమిత్తం రోడ్డు డైవర్షన్లను ఏర్పాటు చేశారు. దాంతో ఈ వీకెండ్‌లో ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తు అవకాశం ఉంది. దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ), మరాకేష్‌ స్ట్రీట్‌ మరియు ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌లోని ఇంటర్‌సెక్షన్‌ వద్ద, అలాగే ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌లోని ఎమిరేట్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద నిర్వహణ పనుల్ని ప్రారంభించింది. దాంతో కొన్ని రోజులపాటు ట్రాఫిక్‌ సమస్యలు తప్పవు. మొదటి ఫేజ్‌లో 8 గంటలపాటు పనులు నిర్వహిస్తారు. దాంతో టెర్మినల్‌ 3 వైపుగా మరాకేష్‌ స్ట్రీట్‌లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్లస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అత్యంత క్లిష్టతరమైన ఈ రోడ్‌ వర్క్‌ జరుగుతోందనీ, ఈ పనులు పూర్తయితే దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయానికి 90 మిలియన్‌ ప్రయాణీకుల సంఖ్య 118 వరకూ పెరుగుతందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ - స్ట్రాటజీ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం - రిచార్డ్‌ తాలియన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com