విమానాలను రోడ్లపైకి తేవడంలో శిక్షణ...... పాకిస్థాన్
- September 23, 2016
విమానాలను రోడ్లపైకి తేవడంలో పాకిస్థాన్ వైమానిక దళం శిక్షణ పొందుతోందట. దేశ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్ మధ్య రహదారిని మూసేసి మరీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది సాధారణ శిక్షణేనని, ఉరీ ఘటన నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తలు కారణం కాదని వైమానిక దళాధికారులు చెప్తున్నారు. పాకిస్థాన్ వైమానిక దళం అధికార ప్రతినిధి కమొడోర్ జావేద్ మహ్మద్ అలీ మాట్లాడుతూ విమానాలు రోడ్లపైకి వచ్చాయని, కొన్నేళ్ళుగా వాళ్ళు ఇలాగే చేస్తున్నారన్నారు. రన్‌వేలు పాడైనా, అందుబాటులో లేకపోయినా ఈ డ్రిల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ విన్యాసాలను ఇటీవల ఇండియాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్వహించడం లేదన్నారు.కాకతాళీయంగా మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







